మంగళవారం 31 మార్చి 2020
International - Feb 18, 2020 , 00:08:19

బుర్కినాఫాసోలో హత్యాకాండ

బుర్కినాఫాసోలో హత్యాకాండ

ఔగాడౌగు, ఫిబ్రవరి 17: పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో యాఘా రాష్ట్రం పన్సీ పట్టణ పరిధిలో తీవ్రవాదులు మరోసారి హింసాకాండకు దిగారు. ఒక చర్చి పాస్టర్‌, కిడ్నాపైన ముగ్గురు వ్యక్తులతోపాటు 24 మందిని దారుణంగా కాల్చి చంపారు. చర్చికి నిప్పంటించారు. సుమారు 20 మంది సాయుధులు ఈ హత్యాకాండలో పాల్గొన్నారు. ప్రొటెస్టెంట్‌ చర్చికి సమీపంలో మహిళలు, పురుషులను వేరు చేసిన తర్వాత కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు దుకాణాల్లోని బియ్యం, వంట నూనెలను లూటీ చేశారని బౌండోర్‌ మేయర్‌ సిహన్రీ ఒసాంగోలా బ్రిగేడ్‌ వెల్లడించారు. తీవ్రవాదులు క్రైస్తవులను, ముస్లింలను మట్టుబెట్టారని భద్రతా అధికారులు తెలిపారు. 


logo
>>>>>>