పారిస్ : ఫ్రాన్స్‌లో జరిగిన ఓ జంట హత్య కేసులో దర్యాప్తు అక్కడి పోలీసులకు సవాల్‌గా మారింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు కవల సోదరులు కావటంతో, ఇందులో ఎవరు కాల్పులు జరిపారన్నది గుర్తించటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇద్దరూ కలిసి హత్యకు పథకం వేసినప్పటికీ, హత్యకు పాల్పడింది ఒకరే.
2020లో జరిగిన రెండు హత్యలు, మరికొన్ని హత్యాయత్నాల్లో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. ఈ హత్యలకు ఉపయోగించిన రైఫిల్‌పై లభించిన డీఎన్ఏ కవల సోదరులదని దర్యాప్తులో తేలింది. కవల సోదరుల్లో ఎవరు కాల్పులు జరిపారన్నది వారి తల్లి మాత్రమే చెప్పగలదని.. దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు.