ఇస్లామాబాద్, డిసెంబర్ 6: పాకిస్థాన్ పార్లమెంట్లో ఇటీవల ఒక గాడిద హల్ చల్ చేసింది. జాతీయ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, భద్రతా వైఫల్యం వల్ల సభలోకి ప్రవేశించిన ఒక గాడిద సభ్యుల కుర్చీల వద్ద తచ్చాడింది.
దీంతో దానిని తరిమికొట్టడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నించగా, భయంతో అది సభ్యుల సీట్ల వైపు పరుగులు తీయడంతో వారు కుర్చీల నుంచి కిందపడ్డారు.