వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ రాజకీయ దుమారం రేపింది. తన విధానాలను నిరసిస్తున్న వారిని ఎగతాళి చేస్తూ ఆయన ఈ ఏఐ-జనరేటెడ్ వీడియోను పెట్టారు. దీనిలో ఆయన కిరీటాన్ని ధరించి, ‘కింగ్ ట్రంప్’ అని రాసి ఉన్న యుద్ధ విమానానికి పైలట్‌గా కనిపించారు.
టైమ్స్ స్కేర్ వద్ద విమానంలో ప్రయాణిస్తూ, కింద ఉన్న నిరసనకారులపైకి బురద జల్లుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. కాగా, ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని ఎండగడుతూ ‘నో కింగ్స్’ పేరుతో అమెరికాలోని దాదాపు 2,700 నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.