వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ స్టేట్స్లో ఒకటైన అరిజోనాలో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అన్ని స్వింగ్ స్టేట్స్నూ ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. వీటన్నిటిలోనూ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్ ఓటమిపాలయ్యారు. అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా స్వింగ్ స్టేట్స్ అనే సంగతి తెలిసిందే. అరిజోనాలో మొత్తం 11 ఎలక్టొరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి.