Donald Trump : ఇరాన్, అమెరికా మధ్య రెండో దఫా చర్చలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రత్యర్ధి దేశాన్ని హెచ్చరించారు. అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీ దేశం అభివృద్ధి చెందుతుంది లేదంటే నాశనం చేస్తాం అని ఇరాన్‌కు ట్రంప్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పుల విరమణ గుడువు పెంచేది లేదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు గతం 47 ఏళ్లలో అమెరికాను ఏలిన వారికంటే తాను రక్తం మరిగిన ఇరాన్ నేతలతో చాలా బాగా చర్చలు జరుపుతున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలకు గడువు మించిపోతోంది. ఏప్రిల్ 22న బుధవారం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరగాల్సి ఉండగా.. ఇరాన్ మాత్రం అయిష్టత చూపిస్తోంది. గడువుకు మరో 48 గంటలే ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ చర్చలపై ఆశావహ దృక్ఫథంలో ఉన్నారు. తాము ఇరాన్ విషయంలో విజయవంతంగా వ్యవరిస్తున్నామని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు.. ఇరాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Donald Trump Signals Hard Line: “I Do Not Want to Extend the Ceasefire”
Trump’s stance raises tensions, suggesting a shift away from diplomacy as uncertainty grows over what comes next in the conflict. #WashingtonEye pic.twitter.com/D9n2SiF6JL
— Washington Eye (@washington_EY) April 21, 2026
‘అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇరాన్ ఎంతో లాభపడుతుంది. ఆ దేశం మళ్లీ అభివృద్ధి చెందుతుంది. మరోసారి అద్భుతమైన ఇరాన్‌ను చూస్తారు. ఆ దేశంలో గొప్పవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే.. అందుకు వాళ్లు కామన్ సెన్స్‌ను ఉపయోగించాల్సి ఉంది అని వెల్లడించిన ట్రంప్ కాల్పుల విరమణ గడువును పొడిగించేది లేదని స్పష్టం చేశారు. కాల్పులు విరమణ గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించం. ఆ ఆలోచనే నాకు లేదు. మాకు అంత సమయం కూడా లేదు. ఇరాన్ నాయకత్వానికి బుద్ధి రావాలంటే బాంబులతోనే స్పందించాలి. అందుకే మేము సిద్ధంగా ఉన్నాం. నేను యుద్ధం గెలవబోతున్నా. చాలా విషయాలు మాకు అనుకూలంగా జరుగుతున్నాయి. మా సైన్యం అద్భుతంగా పనిచేస్తోంది’ అని ట్రంప్ తెలిపారు.
President Trump posts on TruthSocial: Iran decided to fire bullets yesterday in the Strait of Hormuz — A Total Violation of our Ceasefire Agreement! Many of them were aimed at a French Ship, and a Freighter from the United Kingdom.
That wasn’t nice, was it? My Representatives… pic.twitter.com/RpbTh6Xty4
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 19, 2026
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మళ్లీ చర్చల ఊసెత్తారు. ఇస్లామాబాద్‌లో వారం క్రితం జరిపిన మొదటి విడత చర్చలు విఫలమవ్వడం, హర్మూజ్‌పై ఇరాన్ మళ్లీ ఆంక్షలు విధించడంతో ట్రంప్ మాట్లడుకుందాం రండి అని ఆహ్వానిస్తూనే బెట్టు చేశారంటే నాశనం చేస్తామని హెచ్చరించారు. ‘హర్మూజ్ జలసంధిలో కాల్పులు జరపాలని శనివారం ఇరాన్ నిర్ణయించుకుంది. ఇది పూర్తిగా కాల్పుల విరమణ ఉల్లంఘన. ఫ్రాన్స్ నౌకలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఇది మంచిది కాదు. నా ప్రత్యేక ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకుంటారు. అయితే.. ఇరాన్ తామ్ హర్మూజ్‌ను మూసేస్తామని ప్రకటించింది. కానీ, అంతకంటే ముందే మా యుద్ధ నౌకలు హర్మూజ్‌ను దిగ్భందించాయి. ఇరాన్ తీరుతోనే రోజుకు ఆ దేశానికి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. అమెరికాకు ఏమీ నష్టం లేదు.

ఇప్పటికే చాలా నౌకలు టెక్సాస్, లూసీయానా, అలస్కా ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. చర్చల కోసం నా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారు. వారు రేపు(సోమవారం) సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. ఈసారి మేము ఇరాన్‌కు ఆమోదయోగ్యమైన .. సహేతుకమైన డీల్ ఇస్తున్నాం. వారు అందుకు అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నా. ఒకవేళ వారు అంగీకరించకుంటే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జ్‌లను అమెరికా నాశనం చేస్తాం. ఇకపై నేను మంచి వ్యక్తిలా ఉండను. ఐఆర్జీసీ ప్రతినిధులు త్వరగా మాతో అంగీకారానికి రావాలి. వారు గనుక మా ప్రతిపాదనల్ని తిరస్కరిస్తే.. ఇకపై జరిగింది, జరగబోయేది నేను చూసుకుంటా. ఇరాన్లో హత్యల యంత్రం శకం ముగిసే సమయం వచ్చేసింది’ అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.