Donald Trump | వాషింగ్టన్: హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి పన్ను మినహాయింపు హోదాను రద్దు చేయబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. క్యాంపస్ ఉద్యమాలపై ఆంక్షలు విధించడంతోపాటు మరికొన్ని సంస్కరణలను అమలు చేయాలని ట్రంప్ చేసిన డిమాండ్‌కు హార్వర్డ్ అంగీకరించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రూత్ సోషల్‌లో ఇచ్చిన పోస్ట్‌లో, “ఇదే తగిన శాస్తి” అని ట్రంప్ పేర్కొన్నారు.
అడ్మిషన్ విధానాలు, ఆడిట్, కొన్ని స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపు రద్దు వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ కోరగా.. ప్రభుత్వానికి లొంగేది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. కొద్ది గంటల్లోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ వర్సిటీకి 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను స్తంభింపజేసింది.