Donald Trump | వాషింగ్టన్, డిసెంబర్ 18: అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాన్ని విధిస్తున్నదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొన్ని అమెరికా వస్తువుల దిగుమతిపై భారత్ విధిస్తున్న సుంకానికి ప్రతీకారంగా ప్రతిస్పందిస్తూ తాము కూడా భారత్ వస్తువులపై అంతే సుంకాన్ని విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
కొన్ని అమెరికా వస్తువులపై భారత్, బ్రెజిల్ భారీ దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ మంగళవారం విలేకరుల వద్ద వెల్లడించారు. ‘దీనికి జవాబు ఉంటుంది. వాళ్లు మనకు పన్ను విధిస్తే అంతే పన్ను మనం కూడా విధిస్తాం. దాదాపు అన్ని విషయాలలో వారు మనకు పన్ను విధిస్తున్నారు. వారికి మాత్రం మనం పన్ను వేయడం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.