Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన ఆక్రోషం వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అమ్మి భారీ లాభాలు ఆర్జిస్తుందని.. అలా చేస్తున్నందుకు భారత్‌పై మరిన్ని సుంకాలను గణనీయంగా పెంచనున్నట్లు సోమవారం తెలిపారు. భారత్ చమురును కొనుగోలు చేయడంతో.. రష్యా ఇంకా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని.. యుద్ధం వల్ల ఎంతో మంది చనిపోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు.
సోషల్ మీడియా పోస్ట్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. భారత్ భారీ మొత్తంలో రష్య చమును కొనుగోలు చేయడమే కాకుండా.. ఆ కొనుగోలు చేసిన చమురులో ఎక్కువ భాగాన్ని బహిరంగ మార్కెట్లో భారీ లాభాలతో విక్రయిస్తుందని ఆరోపించారు. యుద్ధంలో ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నా భారత్‌కు పట్టింపు లేదని.. అందుకే భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచబోతున్నట్లు చెప్పారు.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడి సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సైతం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాతో భారత్ నిజాయితీగా వ్యవహరించడం లేదని.. అమెరికాను మిత్రదేశంగా చెప్పుకుంటుందని.. అమెరికా వస్తువులను ఆమోదించదని.. భారీ సుంకాలను విధిస్తుందని మిల్లర్ ఆరోపించారు. భారతదేశం అమెరికా వలస విధానాన్ని తప్పుగా ఉపయోగించుకుంటుందని.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని స్టీఫెన్ మిల్లర్ చెప్పుకొచ్చారు.