వాషింగ్టన్: భారత్, పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన దాడుల సందర్భంగా 4-5 యుద్ధ విమానాలు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వ్యాపార ఆశలు చూపించి రెండు అణ్వస్త్ర దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని మరోసారి ఆయన ప్రకటించారు.
శుక్రవారం వైట్‌హౌస్‌లో కొందరు రిపబ్లికన్ పార్టీ ఎంపీలకు ఇచ్చిన విందులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాలిలోనే నాలుగైదు యుద్ధ విమానాలు కూల్చివేతకు గురయ్యాయని, బహుశా ఐదు విమానాలు కూలిపోయినట్లు తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు.