Donald Trump: ఇరాన్‌కు అమెరికా పైలెట్ చిక్కితే ఏంచేస్తారు? ఆ ప్రశ్నకు ట్రంప్ ఏమన్నారంటే
Donald Trump: అమెరికా పైలెట్ ఇరానియన్లకు చిక్కితే ఏం చేస్తారన్న ప్రశ్నపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. బహుశా అలా జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. ఫైటర్ జెట్ కూలినా.. ఇరాన్‌తో చర్చల ప్రక్రియపై ప్రభావం ఉండబోదన్నారు. హోర్ముజ్‌ను తెరిచే సామర్థ్యం ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.
న్యూయార్క్: ఇరాన్ వార్‌లో తొలిసారి అమెరికా ఫైటర్ జెట్ నేలకూలింది. అది కూడా ఇరాన్ భూభాగంలో పడింది. ఇక ఆ ఫైట్‌లో ఓ యూఎస్ పైలెట్ ఇరాన్ భూభాగంలోనే ఉన్నట్లు తెలిసింది. ఆ ఫైటర్ పైలెట్‌ను పట్టుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం నజరానా కూడా ప్రకటించింది. అయితే అమెరికా ఫైటర్ విమానం కూలినా.. ఇరాన్‌తో జరిగే చర్చలపై ప్రభావం ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. పైలెట్ గురించి అమెరికా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కానీ దాని గురించి ఆయన చర్చంచలేదు.
ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం జరుగుతోందని, వార్‌లో ఇవన్నీ సహజమే అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇక ద ఇండిపెండెంట్ పత్రికకు శుక్రవారం మరో ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు ట్రంప్. ఒకవేళ ఎఫ్-15 యుద్ధ విమానానికి చెందిన పైలెట్‌ను ఇరానియన్లు బంధిస్తే ఏం చేస్తారని అడగ్గా, ఆ ప్రశ్నకు ట్రంప్ స్పందించేందుకు నిరాకరించారు. బహుశా అలాంటి సంఘటన జరగకపోవచ్చు అని ట్రంప్ తెలిపారు. ఇక తన ట్రుత్ సోషల్‌లో చమురుపై ఓ పోస్టు చేశారు. కీప్ ద ఆయిల్.. ఎనీవన్ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని అమెరికా చాలా సులువుగా ఓపెన్ చేయగలదు అని తెలిపారు. హోర్ముజ్ జలసంధి అంశాన్ని ప్రపంచదేశాలకు వదిలివేస్తున్నట్లు గతంలో చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన మాటను మార్చేశారు. ఆయిల్ తీసుకెళ్లండి, సంపద సృష్టించుకోండి అని తన పోస్టులో రాశారు. ఆయిల్ ప్రవాహం ఎగిసిపడుతోందన్నారు.
దక్షిణ ఇరాన్లో కూలిన ఫైటర్ విమానానికి చెందిన వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్‌ను వెతికేందుకు అమెరికా దళాలు కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. అమెరికా పైలెట్ కోసం ఇరాన్ నజరానా ప్రకటించిన వెంటనే, దక్షిణ ఖుజెస్తాన్ ప్రావిన్సులో కొందరు గన్నులు, ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాతో వేట కోసం వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

