ఓటింగ్ మెషిన్లను సీజ్ చేయాలని రక్షణశాఖను ఆదేశించిన ట్రంప్..

వాషింగ్టన్: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. ఓటమిని తట్టుకోలేకపోయిన ట్రంప్.. ఎన్నికల బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయాలని రక్షణశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డర్‌ను నేషనల్ ఆర్క్విస్ సీజ్ చేసింది. డిసెంబర్ 16, 2020 రోజున ఆ ఆదేశాలు జారీ అయినట్లు వెల్లడైంది. వోటింగ్ మెషీన్లను సీజ్ చేసేందుకు ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో తెలిపారు. కానీ ఆ ఆదేశాల పత్రంపై మాత్రం మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంతకం లేదని తేలింది.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన పోరు యావత్ ప్రపంచార్ని ఆకర్షించింది. ట్రంప్ ఓటమి తర్వాత 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి గురించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హౌజ్ కమిటీకి వచ్చిన 750 లేఖల్లో ఈ లేఖ కూడా ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల బ్యాలెట్ల సీజ్ గురించి రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. ఎన్నికలకు సంబంధించిన మెషీన్లు, ఈక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ డేటా, రికార్డులన్నింటినీ భద్రపరుచాలని ట్రంప్ తన మూడు పేజీల ముసాయిదాలో ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

