న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) జోకేశారు. తాను పోప్ కావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఓ టీవీ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాను పోప్ కావాలనుకుంటున్నానని, అదే తన నెంబర్ వన్ ఛాయిస్ అని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారుసుడిని మే 7వ తేదీన ప్రారంభంకానున్న కాంక్లేవ్‌లో ఎన్నుకుంటారు. ఏప్రిల్ 26వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఫ్రాన్సిస్ అంత్యక్రియులు జరిగిన విషయం తెలిసిందే.
ఫ్రాన్సిస్ స్థానంలో ఎవర్ని ఎన్నుకుంటారని ట్రంప్‌ను అడగ్గా.. దానికి ఆయన బదులిస్తూ తనకు ఎటువంటి ప్రిఫరెన్స్ లేదని, కానీ కార్డినల్స్ మీటింగ్ జరుగుతోందని, అయితే న్యూయార్క్ కార్డినల్ కూడా రేసులో ఉన్నట్లు ఆయన చెప్పారు. కానీ న్యూయార్క్ కార్డినల్ తిమోదీ డోలన్ ఫ్రంట్ రన్నర్ జాబితాలో లేరని ఓ మీడియా కథనం పేర్కొన్నది. అమెరికా నుంచి ఇంత వరకు పోప్ ఎన్నిక కాలేదని కూడా ఓ నేత వ్యాఖ్యలు చేశారు.
Donald Trump:
“I’d like to be Pope. That would be my #1 choice.”
Unglued. pic.twitter.com/qcHdGHpsNf
— Art Candee 🍿🥤 (@ArtCandee) April 29, 2025