దేవుడి దయతో బతికి బయటపడ్డా
దేవుడి దయ వల్లే తను ప్రాణాలతో బయటపడి మీ ముందు ఉన్నానని, త్రుటిలో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మిల్వాకీ, జూలై 19: దేవుడి దయ వల్లే తను ప్రాణాలతో బయటపడి మీ ముందు ఉన్నానని, త్రుటిలో తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఆయన మూడోసారి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరించారు. హత్యాయత్నం జరిగిన తర్వాత తొలిసారి చేసిన ప్రసంగంలో ఆయన ఇటీవల తనపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తు చేసుకున్నారు.
ఆ రోజు తన ప్రసంగ సమయంలో వలసదారులకు సంబంధించిన సమాచారం చూడటం కోసం చార్ట్వైపు చూసేందుకు తల తిప్పానని, అదే సమయంలో దూసుకొచ్చిన బుల్లెట్ తన తలకు బదులుగా చెవిని రాసుకుంటూ పోయిందని తెలిపారు. హత్యాయత్నం అనంతరం దేశ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు నామినేషన్‌ను భక్తితో గర్వంగా అంగీకరిస్తున్నట్టు చెప్పారు. నాలుగు నెలల్లో అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నామని, దేశ చరిత్రలో నాలుగు గొప్ప సంవత్సరాలను ప్రారంభించబోతున్నామని డొనాల్ట్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
ఇంకా చదవల్సిన వార్తలు
బ్రిటన్‌లోని లీడ్స్‌లో ఆకస్మిక అల్లర్లు
లండన్: బ్రిటన్‌లోని లీడ్స్‌లో గురువారం అకస్మాత్తుగా అల్లర్లు చెలరేగాయి. ఓ కుటుంబంలోని నలుగురిని సోషల్ సర్వీసెస్ సిబ్బంది తీసుకెళ్లడంతో పెద్ద ఎత్తున జనం సిటీ సెంటర్‌కు చేరుకున్నారు. యథేచ్ఛగా హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. ఓ డబుల్ డెక్కర్ బస్సును తగులబెట్టి, అనేక వాహనాలను ధ్వంసం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

