న్యూయార్క్, మే 8: భారత్, పాక్ దేశాలు శాంతించాలని, ఒకరిపై మరొకరు దాడులు చేయడం వెంటనే ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘రెండు దేశాలు ఒకరిపై మరొకటి కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. వెంటనే యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నా.
రెండు దేశాలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ట్రంప్ తెలిపారు.రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా ఆర్మీ అధికారి క్లార్క్ తెలిపారు.