వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి, జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అధికారం వ్యక్తిగత న్యాయమూర్తులకు లేదని కోర్టు స్పష్టంచేసింది. అయితే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్ ఇచ్చిన ఆదేశాల చట్టబద్ధతపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. ట్రంప్ జారీచేసిన పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై పలు రాష్ర్టాల్లో కేసులు నమోదైన క్రమంలో.. కోర్టు తాజా తీర్పు ఆయనకు పెద్ద ఊరటనే చెప్పొచ్చు.