న్యూఢిల్లీ, మే 2: ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. బీ2 బాంబర్లతో ఆ దేశంపై దాడి చేసి..అది అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకొన్నామని అన్నారు. ఒకవేళ తాను అలా చేయకుంటే..పశ్చిమాసియా, ఐరోపా దేశాలు ముక్కలైపోయి ఉండేవని వ్యాఖ్యానించారు.
ఫ్లోరిడాలో మాట్లాడుతూ ఇరాన్ నాయకత్వం కూడా బలహీనపడిందని పేర్కొన్నారు. దీంతో ఆ దేశ సైనిక సామర్థ్యం గణనీయంగా క్షీణించిందని తమ సైనిక చర్యతో నాశనమైందని తెలిపారు.