కోర్టు బోనులో ట్రంప్
చట్టాన్ని ఉల్లంఘించానని తనపై దాఖలైన కేసులను కొట్టివేయాలని, ఇందులో తన తప్పేమీ లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అధికార రహస్య పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నారన్న కేసులో మయామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన ట్రంప్ ఫెడరల్ క్రిమినల్ చార్జి కింద కేసు ఎదుర్కొంటున్న మొదటి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు.
వాషింగ్టన్: చట్టాన్ని ఉల్లంఘించానని తనపై దాఖలైన కేసులను కొట్టివేయాలని, ఇందులో తన తప్పేమీ లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అధికార రహస్య పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నారన్న కేసులో మయామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన ట్రంప్ ఫెడరల్ క్రిమినల్ చార్జి కింద కేసు ఎదుర్కొంటున్న మొదటి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు.
అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత వాటిని అప్పగించకుండా అధికార రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగానే తన ఆధీనంలో ఉంచుకుని చట్టాన్ని ఉల్లంఘించారని, ఎన్నో రహస్య పత్రాలను బాహాటంగా ఉంచడం వల్ల దేశ రక్షణకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని ట్రంప్‌పై ఫెడరల్ కోర్టు ప్రాసిక్యూటర్లు ఆరోపణలు చేశారు. ఈ కేసులో ట్రంప్ తప్పేమీ లేదని ట్రంప్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులకు గానీ, ఫిర్యాదుదారులతో గానీ ట్రంప్ సంబంధ బాంధవ్యాలు నెరపరాదని జడ్జి జోనాథన్ గుడ్మన్ ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- court
- Donald Trump
- not guilty
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

