చెర్నోబిల్, అక్టోబర్ 28: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా 1986లో రష్యా (ప్రస్తుతం ఉక్రెయిన్)లోని చెర్నోబిల్లో జరిగిన అణు విద్యుత్ కేంద్రం పేలుడు దుష్ప్రభావం ఇంకా ప్రపంచాన్ని వీడటం లేదు. ప్రస్తుతం అక్కడ ఉన్న కుక్కలు నీలి రంగులోకి మారిపోయి అందరినీ భయపెడుతున్నాయి. చెర్నోబిల్ అణు విద్యత్ కేంద్రం సమీపంలోని రంగు మారిపోయి ప్రకాశవంతమైన నీలి రంగు బొచ్చుతో ఉన్న కొన్ని కుక్కల చిత్రాలను డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ అనే సంస్థ విడుదల చేసింది.
ఇటీవల వాటికి స్టెరిలైజేషన్, వైద్య పరీక్షలు నిర్వహించేటప్పుడు అందులోని మూడు కుక్కలు ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారటాన్ని గమనించారు.దీనికి కారణాలు పరిశీలిస్తున్నారు.