జెరుసలాం: హమాస్ అటాక్‌తో ఇజ్రాయిల్‌లో ప్రస్తుతం పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆ దేశ జాతీయ మెడికల్ ఏజెన్సీ మాగన్ డేవిడ్ ఆడమ్ ఓ హెచ్చరిక చేసింది. విదేశాల నుంచి దిగుమతి అయిన బెస్ట్మిల్క్ను వాడవద్దు అని తన వార్నింగ్‌లో పేర్కొన్నది. విదేశాల నుంచి వస్తున్న పాలను తనిఖీ చేయడం లేదని, దిగుమతి చేసిన తల్లిపాల(Breastmilk)ను వాడడం వల్ల పిల్లల జీవితాలు ప్రమాదంలో పడే ఛాన్సు ఉందని, శిశువులు మరణించే సందర్భాలు కూడా ఉన్నట్లు ఎండీఏ తెలిపింది.
హమాస్ దాడులు వల్ల చాలా మంది పిల్లలు తమ తల్లులకు దూరం అయ్యారు. కొందరు తల్లలు చనిపోయారు. కొందరు కిడ్నాప్ అయ్యారు. కొందరు ఐడీఎఫ్ రిజర్వ్ డ్యూటీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎండీఏ బ్రెస్ట్‌మిల్క్ బ్యాంక్.. శిశువుల కోసం పాలను సరఫరా చేస్తోంది. దేశ ఆరోగ్యశాఖతో సహకరిస్తున్నామని ఎండీఏ వెల్లడించింది. డోనేట్ చేసిన బ్రెస్ట్మిల్క్కు చెందిన ప్రమాణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఇజ్రాయిల్‌కు బ్రెస్ట్‌మిల్క్ దిగుమతి చేస్తున్నారని, కానీ ఆ పాలపై సూపర్వైజింగ్ జరగడం లేదని, దీంతో ఆ పాలల్లో విష ప్రయోగం జరిగే ఛాన్సు ఉందని, ఇది బేబీలకు ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఎండీఏ నేషనల్ బ్రెస్ట్‌మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ షారన్ బ్రాన్స్బర్గ్ జాబరీ తెలిపారు.