వాషింగ్టన్ : వలస ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసేవారంతా దరఖాస్తు రకం, వయసుతో సంబంధం లేకుండా బయో మెట్రిక్తో పాటు డీఎన్ఎన్ను సమర్పించాలని అమెరికా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) శుక్రవారం ప్రతిపాదించింది. కొత్త ప్రతిపాదిత నిబంధన ప్రకారం డీఎన్ఏ, ముఖ, కంటి చిత్రాలు, వేలి ముద్రలు, వాయిస్ ప్రింట్స్ (మాటల వీడియో రికార్డులు), చేతి సంతకాల వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించి వ్యక్తుల నేపథ్యాన్ని, గుర్తింపును ధ్రువీకరించే అధికారం డీహెచ్ఎస్కు ఉంటుంది.
జన్యు పరమైన సంబంధాలు లేదా లింగ నిర్ధారణకు డీఎన్ఏను వినియోగిస్తారు. మోసాలను నివారించేందుకు ఈ బయోమెట్రిక్స్ ఉపయోగపడతాయని డీహెచ్ఎస్ తెలిపింది. వలసలకు సంబంధించిన కేసుల్లోనూ ఈ డాటాను ఉపయోగిస్తారు. 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత ఈ ప్రతిపాదిత నిబంధన అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.