వాషింగ్టన్: దాదాపు 15 కోట్ల సంవత్సరాలనాటి డైనోసార్ అస్థిపంజరానికి రూ.373.41 కోట్ల ధర పలికింది. సోథ్బైలో జరిగిన వేలంలో దీనిని హెడ్జ్ ఫండ్ సైటాడెల్ వ్యవస్థాపకుడు, సీఈవో కెన్ గ్రిఫిన్ సొంతం చేసుకున్నారు. దీంతో వేలం రికార్డులన్నీ బద్ధలయ్యాయి.
దీనిని 2022 మే నెలలో కొలరాడోలో వెలికి తీశారు. దీనికి ‘అపెక్స్’ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు దొరికిన డైనోసార్లలో ఇదే అతి పెద్దదని సోథ్బై తెలిపింది. దీని ఎత్తు 11 అడుగులని, పొడవు 27 అడుగులని వివరించింది. దీనికి 319 ఎముకలు ఉంటాయని అంచనా వేశారని, ప్రస్తుతం 254 ఎముకలు భద్రంగా ఉన్నాయని తెలిపింది.