ఆల్‌ఖైదా చీఫ్‌ను ఎలా హతమార్చారు.. ఏంటీ హెల్ఫైర్ నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్!
హైదరాబాద్: ఆల్‌ఖైదా నేత అయ్మన్ అల్‌జవహరిని అమెరికా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాబూల్‌లో అతన్ని చంపేశారు. అయితే ఆ ఆపరేషన్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. చాలా సీక్రెట్‌గా అల్‌జవహరిని టార్గెట్ చేసి హతమార్చారు. దీని కోసం రెండు డ్రోన్ మిస్సైళ్లను వాడారు. ఆ మిస్సైళ్లు పేలకుండానే టార్గెట్‌ను నాశనం చేశాయి. హెల్ఫైర్ నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్‌తో అల్‌జవహరిని హతమార్చినట్లు భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌కు ఆరు రేజర్ లాంటి బ్లేడ్లు ఉంటాయి. ఇది టార్గెట్‌ను కచ్చితంగా చేధిస్తుంది. కానీ ఎక్కడా బ్లాస్ట్ జరగదు. నింజా ఆర్9ఎక్స్ మిస్సైల్ ప్రయోగించిన సమయంలో మరణాలు కూడా ఎక్కువగా నమోదు కావు.

ఆర్9ఎక్స్ మిస్సైల్‌ను వాడినట్లు ఎక్కడా పెంటగాన్ కానీ సీఐఏ కానీ ఆ సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ హై ప్రొఫైల్ తీవ్రవాద నేతల్ని టార్గెట్ చేస్తున్న సమయంలో ఇలాంటి వెపన్స్‌ను వాడుతారు. తొలిసారి 2017 మార్చిలో ఆర్9ఎక్స్ ఆయుధాన్ని వాడారు. సిరియాలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఆల్ ఖైయిదా సీనియర్ నేత అబూ అల్ ఖైర్ అల్ మాస్రిను ఆ మిస్సైల్‌ను ఏసేశారు. ఆర్9ఎక్స్ అత్యాధునికమైంది, చాలా కచ్చితత్వంగా టార్గెట్‌ను చేధిస్తుంది. మిస్సైల్‌లో పేలుడు పదార్ధాలకు బదులుగా వెడల్పు ఉన్న బ్లేడ్లు ఉంటాయి. ఒబామా పాలన సమయంలో దీన్ని డెవలప్ చేశారు. మిస్సైల్‌కు ఉన్న బ్లేడ్లు.. బిల్డింగ్‌లను కూడా చొచ్చుకుని వెళ్లగలవు.
డ్రోన్ల ద్వారా హెల్ఫైర్ మిస్సైళ్లను ప్రయోగిస్తారు. వీటినే ఫ్లయింగ్ గిన్సు అని కూడా అంటారు. జపాన్ కిచెన్ కత్తులతో వీటిని పోలుస్తారు. అల్యూమినియం క్యాన్లను ఇవి కట్ చేయగలవు. నింజా బాంబ్ అని కూడా ఈ మిస్సైల్‌ను పిలుస్తుంటారు. జూలై 31వ తేదీన కాబూల్ ఇంట్లో ఉన్న బాల్కనీలో ఒంటరిగా నిలుచున్న సమయంలో రెండు హెల్ఫైర్స్తో అటాక్ చేసినట్లు తెలుస్తోంది. అల్‌జవహరి ఉంటున్న బిల్డింగ్‌లో ఒకవైపు కిటికీలు పగిలిపోయాయి. మరో వైపు మాత్రం అంతా నార్మల్‌గా ఉంది. ఈ అటాక్ సమయంలో అల్‌జవహరి ఫ్యామిలీ ఇంట్లోనే ఉంది. కానీ ఆ ఫ్యామిలీలో ఎవర్నీ టార్గెట్ చేయలేదని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

