వాషింగ్టన్, సెప్టెంబర్ 20: అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండే నిశాచరులకు (నైట్ ఔల్స్కు) టైప్-2 డయాబెటిస్‌తోపాటు హృద్రోగాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ‘ఎక్స్పెరిమెంటల్ ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం హెచ్చరించింది. ఉదయం యాక్టివ్‌గా ఉండాలనుకొనేవారు (ఎర్లీ బర్డ్స్) శక్తి కోసం కొవ్వు పదార్థాలపై ఆధారపడుతున్నారని, ఇలాంటివారు అర్ధరాత్రి వరకు మేల్కొనేవారి కంటే అధిక ఫిట్నెస్తో చురుకుగా ఉండగలుగుతున్నారని అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. సాయంత్రం, రాత్రి వేళలో యాక్టివ్‌గా ఉండాలనుకొనేవారు కొవ్వు పదార్థాలను తక్కువగా వినియోగిస్తున్నట్టు తేల్చారు. ఈ రెండు వర్గాలవారి జీవనక్రియల్లో ఉండే తేడాలు మన దేహాల్లో ఇన్సులిన్ వినియోగాన్ని, ఆరోగ్యాన్ని సిర్కాడియన్ రిథమ్ (నిద్ర/మేల్కొలుపు వలయం) ఎలా ప్రభావితం చేయగలదో స్పష్టం చేస్తున్నాయని ప్రొఫెసర్ స్టీవెన్ మాలిన్ తెలిపారు.