న్యూయార్క్, మార్చి 17: ఎక్కువ రోజులు ఆరోగ్యంగా, నవయవ్వనంగా ఉంచే ఎంజైమ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వయసును నెమ్మదించే ఎంజైమ్‌లను కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. అందులోభాగంగా ఆ ఎంజైమ్ మన శరీరంలోని ఇథనాల్‌ను తొలగిస్తుందని పరిశోధకులు తేల్చారు.
గ్లిజరాల్, గ్లిజరాల్డెహైడ్ తదితర విష పదార్థాలను ఒంటి నుంచి బయటకు పంపేస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.