న్యూయార్క్: యుక్తవయస్కుల్లో కనిపించే మనోవ్యాకులత, డిప్రెషన్‌కు బాల్యంలో కనిపించే భయాలే కారణమని అధ్యయనంలో తేలింది. ఈ ప్రమాద కారకాలను గుర్తించే న్యూరోలాజికల్ మెకానిజంను అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. 4 నెలల వయసు నుంచి 26ఏండ్ల వయసు వచ్చేవరకూ 26 మందిపై అధ్యయనం నిర్వహించారు. బాల్యంలో బెరుకుగా, భయంగా ఉన్నవారు, ఎక్కువగా సమాజంలో కలిసేందుకు ఇష్టపడనివారు యుక్త వయసులోకి వచ్చే సరికి డిప్రెషన్‌కు గురవుతున్నారని తేల్చారు. మానసిక సమస్యలు ఎదుర్కొనేవారి మెదడులో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు కనుగొన్నారు.