Flight | ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి ఆదివారం ఉదయం బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన గంటకే.. ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్.. అస్వస్థతకు గురైన వ్యక్తిని పరీక్షించాడు. మెడికల్ ట్రీట్మెంట్ తప్పనిసరి అని చెప్పడంతో.. గాల్లోకి ఎగిరిన గంటకే విమానం మళ్లీ మెల్బోర్న్కు తిరిగి వచ్చింది. అనంతరం అస్వస్థతకు గురైన వ్యక్తిని కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. తిరిగి విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఆ విమానం ఆదివారం రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. విమానం ఆలస్యంగా ఢిల్లీకి చేరుకోవడంతో మిగతా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం తెలియరాలేదు.