న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహూ(Benjamin Netanyahu) ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని దేశాల ప్రతినిధులు వాకౌట్ చేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కొన్ని దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యహూ మాట్లాడుతున్న సమయంలో లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. పాలస్తీనాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదిస్తున్న పశ్చిమ దేశాలను నెతన్యహూ తప్పుపట్టారు. యూదులను ఊచకోత కోసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
గాజాలో రెండేళ్లుగా దాడి చేస్తున్న ఇజ్రాయిల్‌ను ఆపేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కూడా తన వంతు ప్రయత్నంగా దౌత్యపరమైన చర్చల ద్వారా ఇజ్రాయిల్ దూకుడు అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు చెందిన ప్రతినిధులు పాలస్తీనా స్టేట్‌కు ఆమోదం తెలిపారని, హమాస్ నేరాలను చూసి కూడా వాళ్లు మద్దతు ఇచ్చారని నెతన్యహూ ఆరోపించారు.
పాలస్తీనాకు మద్దుతు ఇవ్వడం అంటే యూదుల్ని చంపడమే అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో గత రెండేళ్ల నుంచి 65 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది.