Degrees in Afghan : 2000-2020 మధ్య డిగ్రీలు చెల్లవు : తాలిబాన్ విద్యా మంత్రి
Degrees in Afghan : ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నత విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. ఈ డిక్రీ ప్రకారం గత 20 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన విద్యార్థుల డిగ్రీలు...

కాబూల్ : (Degrees in Afghan) ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నత విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. ఈ డిక్రీ ప్రకారం గత 20 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన విద్యార్థుల డిగ్రీలు చెల్లవు. అష్రఫ్ ఘనీ లేదా హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యలో డిగ్రీలు పొందిన విద్యార్థులను గుర్తించకూడదని ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ చెప్పినట్లు సమాచారం. ఈ ప్రభుత్వాల కాలంలో మతపరమైన విద్యకు విద్యా రంగంలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
ఆఫ్ఘన్ వార్తా సంస్థ టోలో న్యూస్ ప్రకారం, కాబూల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో విద్యా మంత్రి హక్కాని సమావేశమై గత 20 ఏండ్లలో విద్యారంగం గురించి చర్చించారు. మతపరమైన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల హక్కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 2000 నుంచి 2020 వరకు అన్ని రకాల గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను గుర్తించవద్దని ఆదేశించినట్లు సమాచారం. ఈ 20 ఏండ్లలో పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని అన్నట్లు కూడా తెలుస్తున్నది. పీహెచ్డీ చేసిన వారి కంటే మదర్సాల్లో చదువుతున్న వారే ఎక్కువ గుణవంతులు, విద్యావంతులుగా ఉంటున్నారని ఆ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తున్నది.
తాలిబాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాత నిర్ణయాల వలెనే ఆశ్చర్యం కలిగిస్తున్నది. గత 20 ఏండ్లలో ఆఫ్ఘన్లో విద్యారంగం గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచంలోని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు కొత్త తాలిబాన్ పాలనలో మతపరమైన ప్రాతిపదికన మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటం విచారకరమని వారంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
చైనాలో డ్రోన్ల వర్షం.. లైట్‌షోలో ఘటన
కుప్పకూలిన వేలాడే వంతెన : 30 మంది విద్యార్థులకు గాయాలు
అణు రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు : జపాన్
చార్ధామ్ భక్తుల సంఖ్య పరిమితి ఎత్తివేసిన హైకోర్ట్
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
షూటింగ్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌కు ‘గోల్డ్’
వీరనారి రాణి దుర్గావతి జయంతి నేడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

