విండ్హోక్, ఆగస్టు 27: కరువు కోరల్లో చిక్కుకొన్న ప్రజల కడుపు నింపేందుకు 723 వన్య ప్రాణులను వధించాలని నమీబియా సర్కారు నిర్ణయించింది. పరిమితికి ఉంచి ఉన్న వన్యప్రాణులను చంపడానికి నిర్ణయించినట్టు ఆ దేశ పర్యావరణ శాఖ సోమవారం తెలిపింది. తీవ్రమైన కరువు కారణంగా గత నెలలో నమీబియా ఆహార నిల్వల్లో 84 శాతం కరిగిపోయాయి. రానున్న నెలల్లో దేశంలో సగం జనాభా తీవ్ర ఆహార అభ్రదతను ఎదుర్కొనే ప్ర మాదం ఉంది. ఈ నేపథ్యంలో 83 ఏనుగలను వధించి వాటి మాంసా న్ని కరువు ఉపశమన కార్యక్రమం లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు నీటి గుర్రాలు, గేదెలు, జింకలు, బ్లూ వైల్డ్బీస్ట్ జింకలు, అడవి గాడిదలను చంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.