అడిస్ అబాబా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇథియోపియాలోని చెంచో షాఖా గోజ్డి జిల్లాలో కొండచరియలు విరిగిపడి 157 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడడంతో ప్రాణనష్టం పెరిగింది. సోమవారం 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారానికి ఏకంగా 157కు చేరుకుంది.