న్యూయార్క్: ఓ పర్వతారోహకుడు పెరూలోని హౌస్కరాన్ పర్వతాన్ని అధిరోహిస్తూ 22 ఏండ్ల కిందట తప్పిపోయాడు. మంచు కూలి దాని కిందే మరణించినట్లు భావించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
అయితే, వాతావరణ మార్పుల వల్ల ఆ మంచు అంతా కరిగి మృతదేహం పైకి తేలింది. అలా.. 22 ఏండ్ల పాటు ఆ మృతదేహం మంచులోనే భద్రంగా ఉన్నది. అతడి వస్తువులు కూడా చెక్కుచెదరకుండానే ఉన్నాయి. పెరూవియన్ పోలీసులు.. ఆ మృతదేహం అమెరికాకు చెందిన విలియం స్టాంప్ఫిల్ అనే పర్వతారోహకుడిది అని వెల్లడించారు.