హాంకాంగ్, మే 22: మాజీ నటి, సామాజికవేత్త అయిన కాథీ చుయ్కు హాంకాంగ్‌కు చెందిన బిలియనీర్, ప్రాపర్టీ టైకూన్ అయిన ఆమె మామ లీ షో కీ సుమారు 2,134 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బహుమతిగా ఇచ్చారు. మార్చి 17లో మరణానికి ముందు ఆయన తన ఏకైక కోడలు కాథీకి భారీగా ఆస్తులను బహుమతిగా రాసిచ్చారు.
53.5 కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ ఫండ్, 1,974 కోట్ల రూపాయల విలువైన భూమి, 118 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన భవనం, ఒక నౌకను బహుమతిగా ఇచ్చారు. దీంతో ‘వంద బిలియన్ల కోడలు’ అని ముద్దుపేరు పెట్టిన టాబ్లాయిడ్లు ఆమె అదృష్టాన్ని ప్రశంసించాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన 43 ఏండ్ల చుయ్ 2006లో మార్టిన్ లీని వివాహం చేసుకుంది. అప్పట్లో అత్యంత వైభవంగా జరిగిన ఆ వివాహాన్ని వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీగా ప్రచార సాధనాలు వర్ణించాయి.