వాషింగ్టన్: ఒక యువతి కారు డిక్కీలో దాగి తండ్రికి సప్రైజ్ ఇచ్చింది. విదేశాల్లో ఉన్న ఆమె క్రిస్మస్ కోసం తన వద్దకు రావడంపై ఆ తండ్రి ఆనందం పట్టలేకపోయాడు. ఆ కుటుంబానికి చెందిన మెగ్ మక్లాచ్లాన్ అనే మహిళ దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక వృద్ధుడు తన కారు డిక్కీ తెరుస్తాడు. అయితే అందులో ఎవరో కూర్చొని ఉంటడం చూసి షాక్ అవుతాడు. కాగా, అక్కడ ఉన్నది విదేశాల్లో ఉంటున్న తన కుమార్తె అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో కారు డిక్కీ నుంచి కిందకు దిగి వచ్చిన ఆ యువతి ‘హాయ్ డాడ్’ అంటూ తన తండ్రిని సంతోషంతో హగ్ చేసుకుంటుంది.
కాగా, ఈ వీడియోను ఇన్స్టాగ్రామలో పోస్ట్ చేసిన ఆమె సోదరి దీని గురించి వివరిస్తుంది. ‘బెస్ట్ క్రిస్మస్ సప్రైజ్. నా కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటుంది. నా సోదరి జెలటో 12 ఏండ్లుగా స్విట్జర్లాండ్లో ఉంటున్నది. కుటుంబానికి దూరంగా ఉన్న ఆమె మా వద్దకు రావాలని సోమవారం నిర్ణయించుకున్నది. వెంటనే విమానం టికెట్ బుక్ చేసుకుని ఇలా మా వద్దకు చేరింది. ఇది నిజంగా క్రిస్మస్ మాయాజాలం’ అని అందులో పేర్కొంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.