ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 20:08:12

హీలియం బెలూన్లతో 25వేల అడుగుల ఎత్తులోకి.. రికార్డు సృష్టించిన డేవిడ్‌

హీలియం బెలూన్లతో 25వేల అడుగుల ఎత్తులోకి.. రికార్డు సృష్టించిన డేవిడ్‌

డేర్‌డెవిల్ డేవిడ్ బ్లెయిన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాశంలోకి దాదాపు 25 వేల అడుగులు అంటే 7,600 మీటర్లు పైన 52 హీలియం బెలూన్ల సాయంతో విహ‌రించారు. ఆకాశంలో ఎగ‌రాలంటే ప్యారాచూట్ సాయంతో సాధ్యం అనుకునేవాళ్లు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయ‌డానికి హీలియం బెలూన్ల‌తోనే ఆ ముచ్చ‌ట తీర్చుకోవ‌చ్చు. అరిజోనా పేజ్‌లోని ఎడారి నుంచి డేవిడ్‌ ఈ స్టంట్‌ చేశారు. ఆకాశంలో విహరిస్తూనే త‌న స‌హాయ‌కుల బృందంతో రేడియోలో మాట్లాడారు. అయితే 24,900 అడుగుల ఎత్తుకు వెళ్లేస‌రికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆక్సిజ‌న్ మాస్క్ ధ‌రించారు.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. 7,142,188 మంది వీక్షకులతో అత్యధికంగా చూసిన యూట్యూబ్ ఒరిజినల్స్ లైవ్ ఈవెంట్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. 24,900 అడుగుల వరకు వెళ్లిన డేవిడ్‌.. త‌ర్వాత  హీలియం బెలూన్లను వ‌దిలేసి ప్యారాచూట్ సాయంతో కింద‌కి దిగేశారు. బ్లెయిన్ రెండేండ్ల శిక్ష తీసుకున్న త‌ర్వాత ఈ స్టంట్‌కు చేయడం విశేషం.  logo