మాయోట్: ఫ్రాన్స్‌లోని హిందూ మహాసముద్రంలో ఉన్న మాయోట్ ద్వీప సమూహంపై విరుచుకుపడిన చైడో తుఫాన్ వందలాది మందిని బలిగొన్నట్లు ఫ్రెంచ్ అధికారులు ఆదివారం ప్రకటించారు. తుఫాన్ బీభత్సానికి అనేక పట్టణాలు ధ్వంసమయ్యాయని, దాదాపు వెయ్యి మంది వరకు మరణించి ఉండవచ్చని వారు చెప్పారు.
విద్యుత్తు సరఫరా, మంచినీటి సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు వారు చెప్పారు. మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత రావాలంటే చాలా రోజులు పడుతుందని, ప్రాథమిక అంచనాల ప్రకారం14 మంది మరణించారని స్థానిక భద్రతా వర్గాలు తెలిపాయి.