SOLAR DRONE| లండన్: గాలిలో ఏకధాటిగా ఏడాదికిపైగా ఎగురగల అధునాతన డ్రోన్‌ను లండన్‌కు చెందిన బీఏఈ సిస్టమ్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. సౌరశక్తితో నడిచే ఈ డ్రోన్ ఏకంగా 70 వేల అడుగుల ఎత్తులో ఎగురగలదని కంపెనీ తెలిపింది. పగలు సౌరశక్తితో, రాత్రి బ్యాటరీ సాయంతో నడుస్తుందని పేర్కొన్నది. దీని బరువు 150 కిలోలు. సరిహద్దు రక్షణ, సైనిక నిఘా, సహాయక కార్యక్రమాలు, మొబైల్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ తదతర వాటికి ఈ డ్రోన్ ఎంతో ఉపయోగపడుతుంది.