బీజింగ్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ దేశాలను వణికిస్తున్నది. అలాగే మరో సారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇప్పటి ఆహార పదార్థాల్లో కరోనా ఇన్ఫెక్షన్కు సంబంధించిన ఆధారాలు గుర్తించలేదు. ఇటీవల చైనాలో డ్రాగన్ ఫ్రూట్లో కరోనా ఆనవాళ్లు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ పండ్లు వియత్నాం నుంచి దిగుమతి అయ్యాయి. ఈ క్రమంలో చైనాలోని పలు సూపర్మార్కెట్లు మూతపడ్డాయి. చైనాలోని జెజియాంగ్, జియాంగ్జి ప్రావిన్స్ల్లోని తొమ్మిది నగరాల్లో పండ్లను పరిశీలించగా.. కరోనా జాడలు కనిపించాయి. దీంతో పండ్ల కొనుగోలుదారులను సైతం క్వారంటైన్లో ఉంచాలని అధికారులు ఆదేశాలచ్చిరు. అలాగే విదేశాల నుంచి వచ్చే పలు ఆహార పదార్థాలపై పరీక్షలు చేస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం చైనా వియత్నాం నుంచి వచ్చే డ్రాగన్ ఫూట్స్ను నిషేధించింది. గతవారం డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత జియాన్ నగరంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వస్తున్న తరుణంలో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. తాజాగా యుజు నగరంలోనూ లాక్డౌన్ విధించారు.