Nano Vaccine | బీజింగ్ : కొవిడ్ 19 వైరస్ పుట్టుకకు ప్రధాన కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్లతోపాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్ను తయారుచేసినట్టు ‘వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు. ఈమేరకు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రస్తుతం ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా, ఇవి సార్వత్రిక రక్షణ కల్పించలేవు. దీంతో ‘నానో వ్యాక్సిన్’ను తయారుచేసినట్టు సైంటిస్టుల బృందం తెలిపింది. గబ్బిలాలు, ఇతర జంతువులపై పరిశోధనలు జరుపుతున్న ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని గతంలో పలు దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఒత్తిడి వల్ల శుక్రకణాలు చలనశీలతను కోల్పోతాయని ఇప్పటివరకు చదువుకున్నాం. పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. కానీ, ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల్లో వేగం పెరుగుతుందని, పునరుత్పత్తి వ్యవస్థలో అండంతో ఫలదీకరణం ఆశాజనకంగా జరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అన్స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో.. ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల చలనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తెలిసింది. దాని ఫలితంగా జననాల రేటులో వృద్ధి కనిపించిందని పరిశోధకులు వివరించారు.