బ్యాంకాక్, ఆగస్టు 29: పొరుగు దేశం మాజీ నేతకు చేసిన ఒక ఫోన్ కాల్ థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవ్రత పదవికే ఎసరు తెచ్చింది. ఈ మేరకు పార్టీ సస్పెండ్ చేసిన ఆమెను పూర్తిగా పదవి నుంచి తొలగించాలని థాయ్‌లాండ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. కంబోడియా మాజీ నాయకుడితో ఆమె వివాదాస్పద ఫోన్ కాల్ సంభాషణ సంక్షోభానికి కారణమైంది.
ఆమె నైతిక నిబంధనలు ఉల్లంఘించారని, ఆ పదవిలో కొనసాగే హక్కు ఆమెకు లేదని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. రాజ కుటుంబానికి చెందిన షినవ్రత 2024 ఆగస్టులో దేశంలో అతి చిన్న వయసులో ప్రధాని అయ్యి, ఒక్క ఏడాది మాత్రమే ఆ పదవిలో ఉన్నారు.
కంబోడియన్తో సరిహద్దు ఉద్రిక్తతలు ఏర్పడిన క్రమంలో ఈ ఏడాది జూన్ 15న ఆమె కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో మాట్లాడుతూ తమ దేశ ఆర్మీ చర్యలను విమర్శించారు. ఆమెను తొలుత సస్పెండ్ చేసిన కోర్టు, పూర్తిగా తొలగిస్తూ తీర్పు వెలువరించింది.