మాస్కో: రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బష్కోర్టోస్టన్లో డాక్టర్లు కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట ముందుగా జన్యు పరీక్షలు(Genetic Compatibility Testing) చేయించుకోవాలన్న నిబంధన విధించారు. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే జన్యు పరీక్షలు తప్పనిసరిగా అని తేల్చారు. వివాహా మహోత్సవానికి ముందు రిజిస్ట్రీ ఆఫీసులో కచ్చితంగా సర్టిఫికేట్‌ను జతపరుచాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
బష్కిర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ చైర్మెన్ సలావత్ ఖర్సోవ్ తాజా ఆదేశాలపై ఓ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకోబోయే జంట తప్పనిసరిగా డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని, జనటిక్ స్క్రీనింగ్‌ను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఆ జంట పెళ్లి చేసుకుంటే, వాళ్లకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి రుగ్మతలు కానీ అంగవైకల్యం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
జనన రేటును పెంచాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఏదైనా లోపంతో పిల్లలు జన్మిస్తే, అప్పుడు అది జన్యు సంబంధిత సమస్య అవుతుందని, అలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉండేందుకే జన్యు పరీక్షలను తప్పనిసరి చేస్తున్నామని ఖర్సోవ్ తెలిపారు. మ్యారేజీకి అనుమతి కావాలంటే కపుల్స్ కచ్చితంగా డీఎన్ఏ టెస్టు చేసుకోవాల్సిందే అన్నారు.
ఈ ఐడియాపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్‌ను ఇది స్ట్రెస్‌కు గురి చేస్తుందని ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లెనరా ఇవనోవా తెలిపారు. రష్యాలో ప్రతి ఏడాది సుమారు 25 వేల మంది శిశువులు జన్యుపరంపరమైన వ్యాధులతో జన్మిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పిల్లలను కనాలని ఇటీవల పుతిన్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జన్యుపరమైన వ్యాధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. దాంట్లో 36 జెనటిక్ వ్యాధుల్ని సూచించారు. ఒకవేళ లోపాన్ని గుర్తిస్తే , వేగంగా చికిత్సను అందించవచ్చు అన్న అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు.