లండన్: వచ్చే రెండేండ్లలో జీవన వ్యయ సంక్షోభం అతి పెద్ద ప్రపంచ ప్రమాదం కానుందని ప్రపంచ ఆర్థిక వేదిక సర్వే బుధవారం హెచ్చరించింది. వ్యవసాయాభివృద్ధి దేశమైన ఉక్రెయిన్‌కు, ప్రధాన చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ద్రవ్యోల్బణం ముఖ్యంగా చమురు, గ్యాస్, ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కొవిడ్ కూడా ఇందుకు కారణమైందని నివేదిక వివరించింది. యుద్ధం, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు ఒకదానికి ఒకటి అనుసంధానమై ప్రపంచ ప్రమాదాలకు కారణమయ్యాయని తెలిపింది. ఇప్పటికే బడుగు వర్గాలు బాధలు పడుతున్నాయని, వివిధ సంక్షోభాల వల్ల కొత్తగా బడుగు వర్గాలుగా మారుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదని పేర్కొంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశాధినేతలు కలిసికట్టుగా పని చేయాలంది.