గురువారం 28 మే 2020
International - Apr 06, 2020 , 07:29:46

ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 72 వేలు దాటిన కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల 72 వేలు దాటిన కరోనా బాధితులు

ప్రపంచ వ్యాప్తంగా 208 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. మొత్తం 12 లక్షల 72 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ మహమ్మారి 69,424 మందిని చంపేసింది. కరోనా వైరస్‌ నుంచి 2,62,217 మంది బాధితులు కోలుకుంటున్నారు. అమెరికాలో 9,616 మంది, ఇటలీలో 15,887 మంది, స్పెయిన్‌లో 12,641 మంది కరోనా వల్ల మృత్యువాతపడ్డారు. 

భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,119కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనాతో 112 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో 24 గంటల్లో 700 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ర్టాలో ఇప్పటి వరకు 748 మందికి కరోనా సోకగా, 45 మంది మృతి చెందారు. తమిళనాడులో మొత్త కేసులు 571 కాగా, ఢిల్లీలో బాధితుల సంఖ్య 503కు చేరుకుంది. కేరళాలో 314 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 278, రాజస్థాన్‌లో 266, మధ్యప్రదేశ్‌లో 215, కర్ణాటకలో 151, గుజరాత్‌ 128, జమ్ముకశ్మీర్‌ 106 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. 


logo