సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 16:17:14

బ్రెజిల్‌లో 30లక్షలు దాటిన కరోనా రికవరీలు

బ్రెజిల్‌లో 30లక్షలు దాటిన కరోనా రికవరీలు

బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా రికవరీల సంఖ్య 30లక్షలు దాటిందని, దేశంలో మరణాల సంఖ్య 1,20,000 దాటిందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 3,846,153కు చేరుకోగా గడిచిన 24 గంటల్లో 41,350 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. తాజాగా 758 మంది వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు 120,262 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 3,006,812 మంది డిశ్చార్జి అయ్యారు. 

బ్రెజిల్‌లో శుక్రవారం 43,412 కేసులు నమోదు కాగా.. 855 మంది మరణించారు. కరోనావైరస్ కేసులు, మరణాల్లో యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం యూఎస్‌లో 59లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 1,82,000 మందికి పైగా మరణించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo