కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచంపై విరుచుకుపడింది. థర్డ్ వేవ్ రూపంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ కూడా చాప కింద నీరులా విజృంభిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను విధించారు.
అయితే.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని.. వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో కరోనా సోకిన ఓ మహిళ తన ఫ్యామిలీ క్రిస్మస్ పార్టీకి అటెండ్ అయింది. కానీ.. ప్లాస్టిక్ బబుల్ డ్రెస్ వేసుకొని. అవును. కరోనా అనేది ఒక వైరస్. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వచ్చిన వాళ్ల లాలాజలం ద్వారా.. ఇతరులకు సోకుతుంది.
అందుకే.. మాస్క్ తప్పనిసరి చేశారు. అయితే.. ఎలాగైనా తన ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని అనుకున్న ఆ మహిళ ప్లాస్టిక్ బబుల్ సూట్‌ను ధరించింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.
సంవత్సరానికి ఒకసారి చేసుకునే క్రిస్మస్ పార్టీకి తన సోదరి మిస్ కాకూడదని.. కోవిడ్ వచ్చిన ఆ మహిళ సోదరి క్రిస్టా లారాక్స్ ఈ పని చేసిందట. సరికొత్తగా తనకోసమే ప్లాస్టిక్ బబుల్ సూట్‌ను తయారు చేయించిందట. బబుల్ సూట్లో వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని పార్టీని ఎంజాయ్ చేస్తున్న ఆ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి భలేగా ఉంది సూట్. కరోనా వచ్చినా క్రిస్మస్ పార్టీని మాత్రం మిస్ కాలేదు.. సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.