ముస్లిం లీగ్ లౌకిక పార్టీ: రాహుల్
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల్తో తమ పార్టీ పొత్తును ఈ సందర్భంగా సమర్థించారు.
వాషింగ్టన్, జూన్ 2: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల్తో తమ పార్టీ పొత్తును ఈ సందర్భంగా సమర్థించారు. రానున్న మూడు-నాలుగు రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీని తమ పార్టీ ఓడిస్తుందని చెప్పారు. భారత్లో 60 శాతం ప్రజలు బీజేపీకి, నరేంద్ర మోదీకి ఓటేయరన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ప్రతిపక్షాల ఐక్యత కోసం విపక్షాలతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు ఫలిస్తాయనే నమ్మకం తనకు ఉందని రాహుల్ తెలిపారు. నరేంద్ర మోదీని ఓడించడం కష్టమని భారత మీడియా రాయడాన్ని రాహుల్ అతిశయోక్తిగా అభివర్ణించారు. వాస్తవానికి మోదీ చాలా బలహీనంగా ఉన్నారని తెలిపారు. భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నియంత్రణ కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నాయని, ఇవి ప్రజలను ఎక్కువగా బాధిస్తాయన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

