Ebola Virus: కాంగోలో 100 దాటిన ఎబోలా మృతుల సంఖ్య
Ebola Virus: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ వల్ల మృతిచెందిన వారిన సంఖ్య 101కి చేరుకున్నది. ఆ దేశంలోని ఇటురి ప్రావిన్సులో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అయితే అక్కడ ఉన్న సాయుధ గ్రూపుల వల్ల వైరస్ నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. 550 పాజిటివ్ కేసుల్లో వంద మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
బునియా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ వల్ల మృతిచెందిన వారిన సంఖ్య 101కి చేరుకున్నది. ఆ దేశంలోని ఇటురి ప్రావిన్సులో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అయితే అక్కడ ఉన్న సాయుధ గ్రూపుల వల్ల వైరస్ నియంత్రణ కష్టసాధ్యంగా మారుతోంది. తాజాగా ప్రభుత్వం కొత్త నివేదికను రిలీజ్ చేసింది. 550 పాజిటివ్ కేసుల్లో మృతుల సంఖ్య వందకు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 10 మంది మృతిచెందగా, 35 కొత్త కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం చెప్పింది. ఎబోలాలోని బుందిబుగ్యో స్ట్రెయిన్ మహమ్మారిలా మారినట్లు మే 15వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది.
ఆరంభంలో ఎబోలా కేసులను గుర్తించడంలో ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు పరిస్థితిన అదుపులోకి తేవడం కష్టంగా మారింది. ఇటురి, నార్త్ కివు, సౌత్ కివు ప్రావిన్సుల్లో ఎక్కువగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే జుగు, ఇరుము, మాంబసా ప్రాంతాల్లో సాయుధ గ్రూపులు ఉండడం వల్ల అక్కడ వైరస్‌ను అదుపు చేయడం అసాధ్యమవుతోంది. మూడు కీలకమైన ప్రావిన్సుల్లో సుమారు 120 సాయుధ దళాలు ఉన్నాయని, వర్గ పోరు, రాజకీయ ప్రత్యర్థులు, అవినీతి వల్ల అక్కడ హింస పెరుగోతంది. దీంతో ఎబోలా కేసులను గుర్తించి, నియంత్రించడం పెను సవాల్‌గా మారింది.
కాంగోలో సుమారు 10 కోట్ల జనాభా ఉంటుంది. అక్యడ ఈ వైరస్ వ్యాపించడం ఇది 17వ సారి. 1976లో తొలిసారి ఎబోలా వైరస్‌ను గుర్తించారు. ప్రస్తుతం బుందిబుగయో స్ట్రెయిన్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. పొరుగు దేశం ఉగాండా నుంచి ఆ వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి జరిగినట్లు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

