వియత్నాం: ఈ ఫొటోలోని స్టంట్ చూశారా? వియత్నాంకు చెందిన అన్నదమ్ములు గియాంగ్ కువోక్ (37), గియాంగ్ కువోక్ గీప్ (32) తమ రికార్డును తామే తిరగరాసుకున్నారు. తన తలపై తమ్ముడు తలకిందులుగా ఉంటే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కువోక్ 53 సెకన్లలోనే ఏకంగా 100 మెట్లను ఎక్కాడు. 2016లో వీరు 52 సెకన్లలో 90 మెట్లు ఎక్కి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. తాజాగా ఆ రికార్డును అధిగమించారు.