న్యూఢిల్లీ: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం, అధికార మార్పిడి వెనుక అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఉందని భారత దేశ మాజీ గూఢచారి లక్కీ బిష్త్ చెప్పారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచంలో 60కిపైగా దేశాల్లో ప్రభుత్వాలను సీఐఏ కూల్చిందన్నారు. మన పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో సంఘటనలను సీఐఏ ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.
నేపాల్‌లో తనకు తెలిసినవారు చెప్పినదానిని, తన అధ్యయనాన్ని బట్టి చూసినపుడు, నేపాల్ ప్రజలు భారత దేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నారని తెలిపారు. కొత్త ప్రధాన మంత్రి సుశీల అత్యధికంగా అమెరికా వైపు మొగ్గు చూపుతారన్నారు. నేపాల్ అనిశ్చితి వెనుక నూటికి నూరు శాతం సీఐఏ ఉందని తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి 5న నేపాల్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం శనివారం ప్రకటంచింది. ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరింది.