బీజింగ్ : విమానంలో సూది గుచ్చుకోవడంతో తనకు నష్ట పరిహారం చెల్లించాలని ఓ చైనా పౌరుడు కోర్టులో కేసు వేశాడు. ఆ ఘటన వల్ల తాను తీవ్ర మనోవేదనకు లోనవుతున్నానని, తనను మానసికంగా కుంగదీసిన ఈ ఘటనకు ఎయిర్లైన్స్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. చైనా సదరన్ ఎయిర్లైన్స్ తనకు రూ.1.30 లక్షల యువాన్లు(దాదాపు రూ.15 లక్షలు) చెల్లించాలని దావా వేశాడు. ఎయిర్లైన్స్ యాజమాన్యం టికెట్ రిఫండ్, నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చినా బాధితుడు అంగీకరించలేదు.